‘ప్రభుత్వ స్థలాల కబ్జాకు వైసీపీ శ్రేణుల ఎత్తులు’

ABN , First Publish Date - 2022-04-24T06:43:42+05:30 IST

గొలుగొండ మండలం ఏఎల్‌పురంలో విలువైన ప్రభుత్వ స్థలాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇష్టానుసారంగా లేఅవుట్లు వేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని జడ్పీటీసీ మాజీ సభ్యుడు చిటికెల తారకవేణుగోపాల్‌, టీడీపీ నాయకులు ఆరోపించారు.

‘ప్రభుత్వ స్థలాల కబ్జాకు వైసీపీ శ్రేణుల ఎత్తులు’
అక్రమ లే అవుట్‌ను చూపుతున్న తారకవేణుగోపాల్‌, తదితరులు


 గొలుగొండ టీడీపీ  నాయకుల ఆరోపణ

కృష్ణాదేవిపేట, ఏప్రిల్‌ 23 : గొలుగొండ మండలం ఏఎల్‌పురంలో విలువైన ప్రభుత్వ స్థలాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇష్టానుసారంగా లేఅవుట్లు వేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని జడ్పీటీసీ మాజీ సభ్యుడు చిటికెల తారకవేణుగోపాల్‌, టీడీపీ నాయకులు ఆరోపించారు. వైసీపీకి చెందినవారు గ్రామంలోని ప్రభుత్వ స్థలాల్లో ఎటు వంటి అనుమతులు లేకుండా అక్రమ లేఅవుట్లు వేసుకుని పంచు కుం టున్నారని వారి దృష్టికి రావడంతో వెం టనే టీడీపీ నాయకులు వెళ్లి సదరు స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెవెన్యూ అధికారుల అండదండలతోనే స్థానిక వైసీపీ నాయకులు గ్రామంలో విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తు న్నారని ఆరోపించారు. ఇప్పటికే  ఈ గ్రామంలో కొంతమంది అనర్హులకు జగనన్న కాలనీ ఇళ్ల పేరిట స్థలాలు ఇచ్చారన్నారు. తాజాగా అక్రమ లేఅవు ట్‌లు వేసి, లక్షలాది రూపాయలు ఆర్జించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా రని మండిపడ్డారు. వీటన్నింటి పైనా అధికారులు తగు చర్యలు తీసుకో కుంటే అనకాపల్లి కలెక్టర్‌ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడ తామని హెచ్చరించారు. ఎంపీటీసీ మాజీ సభ్యుడు చింతల నారాయణమూర్తినాయుడు, టీడీపీ నాయకులు పెట్ల నారాయణమూర్తి, గొంప వాసు, షేక్‌ రమణ, లగుడు సన్నిబాబు, బొడ్డు జమీలు, వరహాలబాబు, అప్పల రాజు, రాజు తదితరులు పాల్గొన్నారు. 

Read more