-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » YCP public welfare regime-NGTS-AndhraPradesh
-
వైసీపీది ప్రజా సంక్షేమ పాలన
ABN , First Publish Date - 2022-10-04T06:42:04+05:30 IST
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది ప్రజా సంక్షేమ పాలన అని ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు.

పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి
పాడేరు రూరల్, అక్టోబరు 3: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది ప్రజా సంక్షేమ పాలన అని ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. లగిశపల్లి గ్రామ సచివాలయ పరిధిలోని గురుపల్లి, తోటలగున్నలు, చావడిమామిడి, ముల్లుగరువు, ఎర్రగుప్ప గ్రామాల్లో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐదు గ్రామాల్లో 188 గృహాలను సందర్శించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే ఆయా గ్రామాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ పాలనలో పేదవాడి పెదవులపై చిరునవ్వులు కనిపిస్తున్నాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, కాడెలి, లగిశపల్లి, వంజంగి, కించూరు, గబ్బంగి పంచాయతీల సర్పంచ్ వనుగు బసవన్నదొర, లకే పార్వతమ్మ, వంతాల బొంజుబాబు, వంతాల రాంబాబు, నీలకంఠంనాయుడు, ఎంపీటీసీ సభ్యులు లకే రామకృష్ణ పాత్రుడు, చల్లా చిట్టమ్మ, సన్యాసిరావు, నరసింహమూర్తి, ఉప సర్పంచ్ పసుపుల సత్యనారాయణ, వైసీపీ నాయకులు ఎస్.దశమూర్తి, కె.సూరిబాబు, ఎం.కన్నాపాత్రుడు, సుదర్శన్, ఎం.సత్యవతి, కె.సుశీల, భారతి పాల్గొన్నారు.