అబద్ధాలు చెప్పడానికి వైసీపీ నేతలకు సిగ్గులేదు: లోకేశ్‌

ABN , First Publish Date - 2022-11-12T04:09:51+05:30 IST

ఢిల్లీ మద్యం కుంభకోణంతో తమకు ఎలాంటి సంబంధంలేదని వైసీపీ నేతలు చెప్పడాన్ని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి లోకేశ్‌ తీవ్రంగా ఖండించారు. ...

అబద్ధాలు చెప్పడానికి వైసీపీ నేతలకు సిగ్గులేదు: లోకేశ్‌

మంగళగిరి, నర్సీపట్నం, అమరావతి(ఆంధ్రజ్యోతి), నవంబరు 11: ఢిల్లీ మద్యం కుంభకోణంతో తమకు ఎలాంటి సంబంధంలేదని వైసీపీ నేతలు చెప్పడాన్ని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి లోకేశ్‌ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయన మంగళగిరిలో మాట్లాడుతూ, శరత్‌ చంద్రారెడ్డికి ఎటువంటి సంబంధమూ లేకుంటే ఈడీ అతన్ని ఎందుకు అరెస్టు చేసింది? అని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పడానికి వైసీపీ నేతలకు సిగ్గులేదన్నారు. ఈ అరెస్టుల వెనుకవున్న అసలు కథేమిటో చెప్పాలని ప్యాలస్‌ పిల్లిని తాను డిమాండ్‌ చేస్తున్నా’నన్నారు. తన పాదయాత్ర గురించి అధికారికంగా త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. కాగా, లోకేశ్‌ పాదయాత్ర జరగనుండడంతో తాడేపల్లి గ్యాంగ్‌లో వణుకు మొదలైందని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేశ్‌ విమర్శించారు. జగన్‌ దిగిపోతే తప్ప రాష్ట్రం బాగుపడదని మాజీ మంత్రి జవహర్‌ అన్నారు.

ఆజాద్‌కు టీడీపీ నివాళి

దేశంలో విద్యారంగ సంస్కరణలకు ఆద్యుడు మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ అని ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు చెప్పారు. శుక్రవారం ఆజాద్‌ జయంతి సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.

Updated Date - 2022-11-12T04:09:51+05:30 IST

Read more