హెచ్‌పీసీఎల్‌ గేటు వద్ద కార్మికుల ఆందోళన

ABN , First Publish Date - 2022-07-07T06:28:26+05:30 IST

హెచ్‌పీసీఎల్‌ విస్తరణ పనులు చేపడుతున్న ఎల్‌ అండ్‌ టీ సంస్థ కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని కాంట్రాక్టు కార్మికులు హెచ్‌పీసీఎల్‌ గేటు వద్ద అకస్మాత్తుగా ఆందోళనకు దిగారు.

హెచ్‌పీసీఎల్‌ గేటు వద్ద కార్మికుల ఆందోళన
కార్మికులతో మాట్లాడుతున్న ఎల్‌ అండ్‌ టీ సంస్థ అధికారి

మల్కాపురం, జూలై 6: హెచ్‌పీసీఎల్‌ విస్తరణ పనులు చేపడుతున్న ఎల్‌ అండ్‌ టీ సంస్థ కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని కాంట్రాక్టు కార్మికులు హెచ్‌పీసీఎల్‌ గేటు వద్ద అకస్మాత్తుగా ఆందోళనకు దిగగా.. అదే సమయంలో హెచ్‌పీసీఎల్‌ పాత గ్యాస్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ వద్ద విస్తరణ పనుల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలంటూ స్థానిక యువకులు ఆందోళన చేపట్టారు. హెచ్‌పీసీఎల్‌లో ఎల్‌ అండ్‌ టీ సంస్థ ద్వారా శిల్పి కంపెనీలో కంపెనీలో సుమారు 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. దీంతో సోమవారం వీరు నిరసన తెలపగా.. రిఫైనరీ అధికారులు రెండు రోజుల్లో మీ జీతాలు మీ అకౌంట్లలో హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. అయితే బుధవారం నాటికి జీతాలు పడకపోవడంతో మళ్లీ వారు ఆందోళనకు దిగారు. దీంతో ఎల్‌ అండ్‌ టీ సంస్థకు చెందిన ముఖ్య అధికారి ఒకరు గేటు వద్దకు వచ్చి రాత్రికల్లా ఒక నెల జీతమైనా అకౌంట్లలో వేస్తామని హామీ వారు శాంతించారు. జీతాలు పడకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇదిలావుండగా ఎల్‌ అండ్‌ టీ సంస్థలో ఉపాధి కల్పిస్తామని పలుమార్లు సంస్థ యజమాన్యాన్ని కోరినా ఫలితం లేకపోవడంతో తాము ఆందోళనకు దిగామని స్థానిక యువకులు పేర్కొన్నారు. తమకు ఉపాఽధి కల్పించకపోవతే ఇతర కార్మికులు విధుల్లోకి వెళ్లకుండా రోజూ తాము అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.


Read more