2 నుంచి జూలో వన్యప్రాణి వారోత్సవాలు

ABN , First Publish Date - 2022-09-30T06:05:11+05:30 IST

ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాలలో అక్టోబరు 2 నుంచి 8వ తేదీ వరకు వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఇందిరాగాంధీ జంతుప్రదర్శనశాల క్యూరేటర్‌ డాక్టర్‌ నందనీ సలారియా తెలిపారు.

2 నుంచి జూలో వన్యప్రాణి వారోత్సవాలు

ఆ రోజుల్లో 12 ఏళ్ల లోపు బాలబాలికలకు ఉచిత ప్రవేశం

జూ క్యూరేటర్‌ నందనీ సలారియా

విశాఖపట్నం, సెప్టెంబరు 29: ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాలలో అక్టోబరు 2 నుంచి 8వ తేదీ వరకు వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఇందిరాగాంధీ జంతుప్రదర్శనశాల క్యూరేటర్‌ డాక్టర్‌ నందనీ సలారియా తెలిపారు. వారం రోజులు వన్యప్రాణులపై పూర్తి అవగాహన కలిగించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి విజేతలైన వారికి బహుమతులు అందజేస్తామని చెప్పారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు జూ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వారోత్సవాల రోజుల్లో పన్నెండేళ్లలోపు చిన్నారులకు జూ ప్రవేశం ఉచితమని, విద్యార్థులు ఎటువంటి రుసుము చెల్లించకుండా పోటీల్లో పాల్గొనవచ్చునని చెప్పారు. పూర్తి వివరాలకు 9441130894, 94408 102133, 7893632900 నంబర్లను సంప్రదించాలని సూచించారు.  

Read more