కౌన్సిల్‌ సమావేశం ఎందుకు నిర్వహించలేదు

ABN , First Publish Date - 2022-10-01T07:01:54+05:30 IST

ప్రతి నెల నిర్వహించే మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశం ఈనెల ఎందుకు నిర్వహించలేదని టీడీపీ కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు.

కౌన్సిల్‌ సమావేశం ఎందుకు నిర్వహించలేదు
అధికారులను నిలదీస్తున్న కౌన్సిలర్లు చింతకాయల పద్మావతి, రాజేశ్‌


మునిసిపల్‌ అధికారులను నిలదీసిన టీడీపీ కౌన్సిలర్లు


నర్సీపట్నం, సెప్టెంబరు 30: ప్రతి నెల నిర్వహించే  మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశం ఈనెల ఎందుకు నిర్వహించలేదని టీడీపీ కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. శనివారం చింతకాయల పద్మావతి ఆధ్వర్యంలో పెదబొడ్డేపల్లిలోని మునిసిపల్‌ కార్యాలయానికి వెళ్లిన కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. ఈనెల కౌన్సిల్‌ సమావేశం పెట్టకపోవడానికి కారణమేమిటని 26 వార్డు కౌన్సిలర్‌ పద్మావతి ప్రశ్నించారు. వార్డుల్లో అనేక సమస్యలు ఉన్నాయని, ఇటువంటి తరుణంలో కౌన్సిల్‌ సమావేశం నిర్వహించకపోవడం ఘోరమన్నారు. కమిషనర్‌ వచ్చి సమాధానం చెప్పాలని డీఈ నారాయణరావుని నిలదీశారు. ఈ కార్యక్రమంలో 25వవార్డు కౌన్సిలర్‌ చింతకాయల రాజేశ్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


Read more