అరకులోయకు వారాంతంలో ప్రత్యేక రైలు

ABN , First Publish Date - 2022-11-30T00:58:35+05:30 IST

పర్యాటకుల సౌకర్యార్థం విశాఖ-అరకులోయ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.

అరకులోయకు వారాంతంలో ప్రత్యేక రైలు

డిసెంబరు 3 నుంచి జనవరి 22 వరకూ నడపనున్నట్టు అధికారుల ప్రకటన

విశాఖపట్నం, నవంబరు 29:

పర్యాటకుల సౌకర్యార్థం విశాఖ-అరకులోయ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఈ సర్వీసులు డిసెంబరు మూడో తేదీ నుంచి జనవరి 22వ తేదీ వరకు అందుబాటులో వుంటాయని పేర్కొన్నారు. 08501 నంబర్‌ గల ప్రత్యేక రైలు డిసెంబరు మూడు నుంచి జనవరి 22వ తేదీ వరకు ప్రతి శని, ఆదివారాలు ఉదయం 8.30 గంటలకు విశాఖలో బయలుదేరి 11.30 గంటలకు అరకులోయ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08502 నంబర్‌ గల ప్రత్యేక రైలు డిసెంబరు మూడు నుంచి జనవరి 22వ తేదీ వరకు ప్రతి శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 2.00 గంటలకు అరకులోయలో బయలుదేరి సాయంత్రం 6.00 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఈ సర్వీసులు ఐదు సెకండ్‌ క్లాసు, ఏడు జనరల్‌ సెకండ్‌ క్లాసు, రెండు సెకండ్‌ క్లాస్‌ కమ్‌ లగేజి కోచ్‌లతో సింహాచలం, కొత్తవలస, బొర్రాగుహల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

Updated Date - 2022-11-30T00:58:35+05:30 IST

Read more