-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Wealth centers should be brought into use-NGTS-AndhraPradesh
-
సంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలి
ABN , First Publish Date - 2022-09-10T06:29:45+05:30 IST
మండలంలో చెత్తసంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా పంచాయతీ అధికారిణి శిరిషారాణి ఆదేశించారు.

జిల్లా పంచాయతీ అధికారిణి శిరీషారాణి
బుచ్చెయ్యపేట, సెప్టెంబరు 9: మండలంలో చెత్తసంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా పంచాయతీ అధికారిణి శిరిషారాణి ఆదేశించారు. శుక్రవారం మంగళాపురం, విజయరామరాజుపేటలో చెత్తసంపద కేంద్రాలు, వడ్డాదిలో ఇటీవల వర్షాలకు కూలిపోయిన పశువుల ఆస్పత్రి భవనాన్ని, స్కూల్, హౌసింగ్ ఇళ్ల నిర్మాణాలను ఆమె పరిశీలించారు. చెత్తసంపద కేంద్రాలు నిరుపయోగంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వర్షాలకు కూలిపోయిన పశువుల ఆస్పత్రి భవనం స్థానంలో నూతన భవన నిర్మాణానికి తగిన చర్యలు చేపడతానన్నారు. జగనన్న కాలనీ ఇళ్లను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని హౌసింగ్ ఏఈఈ గోపీనాథ్‌ను ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నందున అంటువ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ చేయించాలని, దోమల నివారణపై ప్రజలో అవగాహన పెంచాలన్నారు. మండలంలో జరుగుతున్న వివిధ ప్రభుత్వ భవన నిర్మాణాలు సకాలంలో పూర్తేయ్యేలా చర్యలు చేపట్టాలని డీపీఓ శిరీషారాణి ఎంపీడీఓను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సువర్ణరాజు, ఈఓపీఆర్‌డీ లోవరాజు, సర్పంచ్‌లు వై.విజయకుమార్, కె.పద్మరేఖ, మండల ఇంజనీర్ కె.శ్రీనివాస్ ప్రభు పాల్గొన్నారు.