ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాం

ABN , First Publish Date - 2022-11-17T03:35:16+05:30 IST

వ్యవసాయవర్సిటీలు, శాస్త్రవేత్తల బృందం కృషి ఫలితంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఆహార ధాన్యాలు...

ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాం

కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌

తిరుపతి(విద్య),నవంబరు16: వ్యవసాయవర్సిటీలు, శాస్త్రవేత్తల బృందం కృషి ఫలితంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఆహార ధాన్యాలు, వివిధ పంటల ఉత్పత్తులను ఎగుమతి చేయగలుగుతున్నామని కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. బుధవారం తిరుపతిలోని ఎస్వీవెటర్నరీ వర్సిటీ ఆడిటోరియంలో వ్యవసాయ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులతో నిర్వహించిన చర్చాగోష్ఠి కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి, వీసీ డాక్టర్‌ విష్ణువర్ధన రెడ్డి చేతుల మీదుగా కేంద్రమంత్రి షెకావత్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో మనం సాధించిన ప్రగతికి ప్రపంచదేశాలు ఆహారఉత్పత్తుల కోసం మనదేశం వైపు చూస్తున్నాయన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఎంపీలు మిథున్‌రెడ్డి, గురుమూర్తి, రెడ్డెప్ప, వెటర్నరీ వర్సిటీ వీసీ డాక్టర్‌ వి.పద్మనాభరెడ్డి, ఈసీ సభ్యులు ిపీ.వెంకటరామమునిరెడ్డి, టీవీ మురళీనాథరెడ్డి, రిజిస్ర్టార్‌ గుత్తా రామారావు, సీవోఈ సుధాకర్‌, ఏడీ వాసంతి, ఏడీఆర్‌ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-17T03:35:17+05:30 IST