AP News: అందుకే నేను గడ్డం పెంచుతున్నాను: విష్ణుకుమార్ రాజు

ABN , First Publish Date - 2022-08-01T18:44:44+05:30 IST

సీఎం జగన్ (CM Jagan) టాక్స్ (Tax) వేయనిది ఏదైనా ఉంది అంటే అది ఒక్క గడ్డం మాత్రమే...

AP News: అందుకే నేను గడ్డం పెంచుతున్నాను: విష్ణుకుమార్ రాజు

విశాఖపట్నం (Visakha): సీఎం జగన్ (CM Jagan) టాక్స్ (Tax) వేయనిది ఏదైనా ఉంది అంటే అది ఒక్క గడ్డం (beard) మాత్రమే... అందుకే నేను గడ్డం పెంచుతున్నానని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు (Vishnukumar Raju) అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశలలో మద్యపానాన్ని (alcohol) నిషేధం (Prohibition) చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి.. మద్యం  షాపులను పెంచుతున్నారని ఎద్దేవా చేశారు. మద్యం షాపుల వద్ద ఉపాధ్యాయులను విధులలో పెట్టిన దుర్మార్గపు ప్రభుత్వం వైసీపీ అని మండిపడ్డారు.


రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ జగన్ ప్రభుత్వంపై తిరగబడాలని విష్ణుకుమార్ రాజు పిలుపిచ్చారు. అయితే మద్యనిషేధం మా నవరత్నాలలో లేదని ఓ మంత్రి చెబుతున్నారని అన్నారు. కుల మత రాజకీయాలకు అతీతంగా జగన్‌ను ఓడించడానికి అందరూ ముందుకు రావాలన్నారు. అందాలకు నెలవు అయిన రుషికొండను నాశనం చేసి విశాఖ ప్రజల మనసులను కూల్చివేశారన్నారు. ఋషికొండలో జరుగుతున్న పనులను పరిశీలించడానికి  వెళ్తున్నవారిని  అడ్డుకుంటున్నారని, కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఋషికొండ ప్రాంతంలో అసలు ఏం కడుతున్నారో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలు వలసలు వెళ్లే పరిస్థితి వస్తుందని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు.

Read more