పర్యాటక రంగానికి విశాఖ అనుకూలం

ABN , First Publish Date - 2022-09-28T05:26:31+05:30 IST

పర్యాటక రంగానికి విశాఖ నగరం ఎంతో అనుకూలమైనదని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆర్కేబీచ్‌లోని కాళీమాత గుడి నుంచి వైఎంసీఊ వరకు నిర్వహించిన ర్యాలీని ప్రారంభించారు.

పర్యాటక రంగానికి విశాఖ అనుకూలం
ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్‌, జీవీఎంసీ కమిషనర్‌ తదితరులు

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున 

బీచ్‌ రోడ్డు, సెప్టెంబరు 27: పర్యాటక రంగానికి విశాఖ నగరం ఎంతో అనుకూలమైనదని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున పేర్కొన్నారు.  ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆర్కేబీచ్‌లోని కాళీమాత గుడి నుంచి వైఎంసీఊ వరకు నిర్వహించిన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ, విదేశీ పర్యాటకులు నగరానికి వస్తున్నారని, వారికి నగరంలో అన్ని మౌలిక వసతులు ఉన్నాయన్నారు. పర్యాటక రంగం అభివృద్ధితో దేశ  ఆర్థిక వ్యవహారాలు ముడిపడి ఉన్నాయన్నారు. ఇటీవల సాగరతీరాన్ని 22 వేల మంది వలంటీర్లతో 28 కిలోమీటర్ల పొడువున శుభ్రం చేశామన్నారు. అనంతరం జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు మాట్లాడుతూ పర్యాటకులను ఆకర్షించేందుకు నగరాన్ని మరింతగా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. నగర పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించాలని పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా ప్లకార్డులు, ప్లాష్‌ మాబ్‌తో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టూరిజం మేనేజర్‌ శ్రీనివాస్‌, జీవీఎంసీ అదనపు కమిషనర్‌ వి.సన్యాసి రావు, జోనల్‌ కమిషనర్‌ శివప్రసాద్‌, ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ కేఎస్‌ఎల్జి శాస్ర్తి, కార్యనిర్వాహక ఇంజనీర్‌ శ్రీనివాస్‌, ఏసీపీ వెంకటేశ్వర రావు, ఇంజనీరింగ్‌, ప్రజారోగ్య సిబ్బంది, వివిధ హోటళ్ల ప్రతినిదులు, తదితరులు పాల్గొన్నారు. 


Read more