విశాఖలో దారి దోపిడీ

ABN , First Publish Date - 2022-03-04T16:11:36+05:30 IST

నగరంలో దుండగులు దారి దోపిడీకి పాల్పడ్డాడు.

విశాఖలో దారి దోపిడీ

విశాఖపట్నం: నగరంలో దుండగులు దారి దోపిడీకి పాల్పడ్డాడు. నర్సీపట్నం కొత్తకోటకు చెందిన వ్యాపారి సింగిడి రాజారావుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆటోలో ప్రయాణిస్తున్న రాజారావును అదే ఆటోలో ప్రయాణిస్తున్న కొందరు వ్యక్తులు చితకబాదారు. రాజారావు వద్ద ఉన్న రెండు లక్షల రూపాయల నగదు, బంగారు ఉంగరం లాక్కుని దుండగులు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Read more