వెంకటాపురం ఐదు మదాల మార్గాన్ని పరిశీలించిన డీఆర్‌ఎం

ABN , First Publish Date - 2022-11-21T00:32:54+05:30 IST

జీవీఎంసీ 89, 92 గ్రామల మధ్యనున్న వెంకటాపురం ఐదు మదాల మార్గాన్ని డీఆర్‌ఎం అనూప్‌ సత్పథీ ఆదివారం పరిశీలించారు.

వెంకటాపురం ఐదు మదాల మార్గాన్ని పరిశీలించిన డీఆర్‌ఎం

గోపాలపట్నం, నవంబరు 20: జీవీఎంసీ 89, 92 గ్రామల మధ్యనున్న వెంకటాపురం ఐదు మదాల మార్గాన్ని డీఆర్‌ఎం అనూప్‌ సత్పథీ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కో-ఆప్షన్‌ సభ్యడు బెహరా భాస్కరరావు ఐదు మదాల మార్గం సమస్యను డీఆర్‌ఎంకు వివరించారు. రైల్వే అనుమతులు లేని కారణంగా నిలిచిపోయిన ఐదు మదాల మార్గం రహదారి నిర్మాణం జరిగితే రెండు వార్డుల ప్రజలకు ఇబ్బందులు తీరుతాయన్నారు. ఐదు మదాల మార్గాన్ని అతి తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేయవచ్చని, ఎత్తయిన మదాల మార్గం గల ఐదు మదాలను ఆధునీకరిస్తే గోపాలపట్నం దిగువ ప్రాంతాలకు భారీ వాహనాలు రాకపోకలు సాగించేందుకు అవకాశం కలుగుతుందని, ఆ దిశగా తగిన చర్యలు చేపట్టాలని డీఆర్‌ఎంను బెహరా కోరారు. కార్యక్రమంలో పలువురు గ్రామ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-21T00:32:58+05:30 IST