రాజాధి రాజ వాహనంపై ఉపమాక వెంకన్న

ABN , First Publish Date - 2022-09-29T06:51:27+05:30 IST

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉపమాక క్షేత్రంలో స్వామివారి తిరువీధి సేవ బుధవారం ఘనంగా జరిగింది. రాజాధిరాజ వాహనంపై ఉభయదేవేరులతో అలంకారప్రాయమైన స్వామివారు మాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

రాజాధి రాజ వాహనంపై ఉపమాక వెంకన్న
మాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారు

నక్కపల్లి, సెప్టెంబరు 28 : బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉపమాక క్షేత్రంలో స్వామివారి తిరువీధి సేవ బుధవారం ఘనంగా జరిగింది. రాజాధిరాజ వాహనంపై ఉభయదేవేరులతో అలంకారప్రాయమైన స్వామివారు మాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అంత కుముందు ఆలయంలో నిత్య పూజలు, హోమాలను అర్చకుల బృందం నిర్వహించింది. నాలాయిర సేవాకాలం, రాజభోగ నివేదన చేశారు. గోదాదేవి అమ్మవారి సన్నిధిలో లక్ష్మీ సహస్రనామ కుంకుమార్చన జరిపారు. ప్రధానార్చకులు గొట్టుముక్కల ప్రసాదాచార్యులు, అర్చకులు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, పీసపాటి శేషాచార్యులు, సాయి గోపాలాచార్యులు, రంగాచార్యులు పూజాలు నిర్వహించారు.

Read more