జగన్‌ పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనం

ABN , First Publish Date - 2022-09-30T06:21:31+05:30 IST

జగన్‌రెడ్డి పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయని చోడవరం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు ఆరోపించారు.

జగన్‌ పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనం
రిలే నిరాహారదీక్ష చేస్తున్న తాతయ్యబాబు తదితరులు

నియోజకవర్గ ఇన్‌చార్జి తాతయ్యబాబు ఆరోపణ

బుచ్చెయ్యపేట, సెప్టెంబరు 29: జగన్‌రెడ్డి పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయని చోడవరం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు ఆరోపించారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పును నిరసిస్తూ టీడీపీ మండల నాయకులు బుచ్చెయ్యపేటలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో గురు వారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు కొనసాగించే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు మాట్లాడుతూ ప్రాంతాల మధ్య, కులాల మధ్య జగన్‌మోహన్‌రెడ్డి చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ఈ దీక్షలో టీడీపీ నాయకులు గోకివాడ కోటేశ్వరరావు, డొంకిన అప్పలనాయుడు, సుంకర సూరిబాబు, మామిడి సంజీవ్‌, శిరిగిరిశెట్టి శ్రీరామూర్తి, కోరుకొండ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more