-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Tribal students dharna in front of ITDA-NGTS-AndhraPradesh
-
ఐటీడీఏ ఎదుట గిరిజన విద్యార్థుల ధర్నా
ABN , First Publish Date - 2022-02-19T06:13:41+05:30 IST
గిరిజన ప్రాంత విద్యాలయాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థులు శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

పాడేరు, ఫిబ్రవరి 18: గిరిజన ప్రాంత విద్యాలయాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థులు శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ర్యాలీగా ఐటీడీఏ కార్యాలయానికి చేరుకుని మెయిన్‌గేటు ఎదుట బైఠాయించారు. గిరిజన విద్యాలయాల్లోని సమస్యలను పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, ప్రతీ ఆశ్రమ పాఠశాలలో వసతి, తరగతి గదులు నిర్మించాలని, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని, పూర్తి స్థాయిలో అధ్యాపకులను నియమించాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రభుదాస్, తదితరులు తమ సమస్యలపై ఇన్‌చార్జి టీడబ్ల్యూ డీడీ ఎల్.రజనికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నేతలు చిన్నారావు, పాపారావు, మోహనకృష్ణ, రాంబాబు, ప్రసాద్, రమణ, సింహాద్రి, విద్యార్థులు పాల్గొన్నారు.