కొవిడ్‌తో ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2022-01-28T06:45:38+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ మరణాలు పెరుగుతున్నాయి. థర్డ్‌ వేవ్‌లో వైరస్‌ తీవ్రత కాస్త తక్కువగా ఉన్నప్పటికీ...దీర్ఘకాలిక అనారోగ్య సమస్య లతో బాధపడుతున్న వారిని మాత్రం ఇబ్బందిపెడుతోంది.

కొవిడ్‌తో ముగ్గురి మృతి

కొత్తగా 1,349 కేసులు నమోదు

విశాఖపట్నం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ మరణాలు పెరుగుతున్నాయి. థర్డ్‌ వేవ్‌లో వైరస్‌ తీవ్రత కాస్త తక్కువగా ఉన్నప్పటికీ...దీర్ఘకాలిక అనారోగ్య సమస్య లతో బాధపడుతున్న వారిని మాత్రం ఇబ్బందిపెడుతోంది. దీంతో చికిత్స పొందుతూ పలువురు మృతిచెందుతున్నారు. గురువారం వివిధ ఆస్పత్రుల్లో ముగ్గురు కరోనాతో చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. వీటితో జిల్లాలో మరణాల సంఖ్య 1,135కు చేరింది. ఇదిలావుండగా గురువారం కొత్తగా 1,349 కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం సంఖ్య 1,84,499కు చేరింది. ఇందులో 1,71,210 మంది కోలుకోగా, మరో 13,289 మంది ఇళ్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 


Read more