పేదల కడుపు కొట్టిన వైసీపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-09-11T05:50:51+05:30 IST

పేదలకు కడుపు నిండా భోజనం అందించకుండా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు.

పేదల కడుపు కొట్టిన వైసీపీ ప్రభుత్వం
అన్నదానం చేస్తున్న పల్లా శ్రీనివాసరావు, తదితరులు

తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

గాజువాక, సెప్టెంబరు 10: పేదలకు కడుపు నిండా భోజనం అందించకుండా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. గాజువాక అన్న క్యాంటీన్‌ సమీపంలో శనివారం పేదలకు భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు మూడు పూటలా సంతృప్తిగా భోజనం చేయాలన్న మంచి సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్న క్యాంటీన్‌లను ఏర్పాటు చేశారన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం పేదలకు ఆహారం అందించడం ఇష్టం లేక అన్న క్యాంటీన్‌లను మూసివేసిందని విమర్శించారు. పేద ప్రజల సంక్షేమమే టీడీపీ లక్ష్యమన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌, కార్పొరేటర్‌లు గంధం శ్రీనివాస్‌, పల్లా శ్రీనివాస్‌, మొల్లి ముత్యాలనాయుడు, నాయకులు నల్లూరు సూర్యనారాయణ, బలగ బాలునాయుడు, నాగేశ్వరరావు, శివప్రసాద్‌, అప్పారావు, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. 


Read more