నెలరోజుల్లోగా ’ప్రసాద్‌’ పథకం పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-26T06:46:36+05:30 IST

పర్యాటక కేంద్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ మంజూరు చేసిన ’ప్రసాద్‌’ పనులకు నెలరోజుల్లోగా భూమిపూజ చేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు పర్యా టక శాఖ మంత్రి ఆర్‌.కె.రోజా తెలిపారు.

నెలరోజుల్లోగా ’ప్రసాద్‌’  పథకం పనులు ప్రారంభం
కప్పస్తంభం వద్ద మంత్రి రోజా

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కె రోజా

సింహాచలం, సెప్టెంబరు 25: పర్యాటక కేంద్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ మంజూరు చేసిన ’ప్రసాద్‌’ పనులకు నెలరోజుల్లోగా భూమిపూజ చేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు పర్యా టక శాఖ మంత్రి ఆర్‌.కె.రోజా తెలిపారు. గాన గంధ ర్వుడు బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సభలో పాల్గొనేం దుకు విశాఖ వచ్చిన ఆమె ఆదివారం ఉదయం సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రసాద్‌ పథకానికి సంబంధించిన డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను కేంద్రానికి అందజేయటం జరిగిందని, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా నెలరోజుల్లోగా భూమి పూజచేయటం జరుగుతుందన్నారు.


రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో ప్రసాద్‌ పథకం క్రింద సింహగిరిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. అదే విధంగా పీపీపీ విధానంలో విశాఖలోని అన్ని వనరులు, మౌలిక వసతులను వినియోగించుకుని నగరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకు అవసరమైన జీవో త్వరలో జారీ చేయనున్నట్లు తెలిపారు.


ఎన్టీఆర్‌ అంటే విశ్వాసం లేనిదెవరికో రాష్ట్ర ప్రజలం దరికీ తెలుసని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఆర్‌కె రోజా అన్నారు.  వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు పురంధేశ్వరి, బాలకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు  చేస్తున్న విమర్శలను ఆమె ఖండించారు.  మూడు రాజధానుల అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు హెల్త్‌ వర్సిటీ పేరు మార్పుపై టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్నారన్నారు.  

Updated Date - 2022-09-26T06:46:36+05:30 IST