వైసీపీ పాలనలో రాష్ట్రం భ్రష్టుపట్టింది

ABN , First Publish Date - 2022-06-07T06:45:51+05:30 IST

వైసీపీ పాలనలో విద్యుత్‌ వినియోగదారు లకు అన్నీ కష్టాలే అని మాడుగుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ అన్నారు. మండలంలోని చంద్రయ్యపేటలో సోమవారం రాత్రి బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వ హించారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం భ్రష్టుపట్టింది
చంద్రయ్యపేటలో పార్టీ శ్రేణలతో పీవీజీ కుమార్‌ నిరసన ర్యాలీ


‘బాదుడే బాదుడు’లో మాడుగుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ 

కె.కోటపాడు, జూన్‌ 6 : వైసీపీ పాలనలో విద్యుత్‌ వినియోగదారు లకు అన్నీ కష్టాలే అని మాడుగుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ అన్నారు. మండలంలోని చంద్రయ్యపేటలో సోమవారం రాత్రి బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓవైపు విద్యుత్‌ చార్జీలు పెం చారని, ఇంకో వైపు తరచూ విద్యుత్‌ కోతలను విధిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అవగాహనా లోపం వల్లే నిత్యావసర వస్తువుల ధరలతో పాటు అన్నింటి ధరలు పెరిగిపోయాయన్నారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, ప్రజల కష్టాలు తీరాలన్నా మళ్లీ చంద్రబాబునాయుడును ముఖ్య మంత్రి చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. మాజీ ఎంపీపీ సబ్బవరపు రామునాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పి.సత్యవతి, టీడీపీ నాయకులు కశిరెడ్డి అప్పలనాయుడు,  జూరెడ్డి రాము, యడ్ల రమేష్‌, కశిరెడ్డి అప్పారావు, బోకం బంగారునాయుడు, సబ్బవరపు ఈశ్వరరావు, గవిరెడ్డి అర్జున, నారాయణ, వెంకునాయుడు, అల్లు సూరిబాబు, బండారు దేముడుబాబు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. 

Read more