మంచి కథ కోసం అన్వేషణ

ABN , First Publish Date - 2022-10-12T06:30:35+05:30 IST

ఈ తరానికి నచ్చే మంచి కథ అన్వేషణలో బిజీగా ఉన్నట్లు వర్ధమాన యువ హీరో, దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ అన్నారు.

మంచి కథ కోసం అన్వేషణ
ఆలయంలో హీరో ఆకాష్‌

పూరీ జగన్నాథ్‌ తనయుడు, హీరో ఆకాష్‌

సింహాచలం, అక్టోబరు 11: ఈ తరానికి నచ్చే మంచి కథ అన్వేషణలో బిజీగా ఉన్నట్లు వర్ధమాన యువ హీరో, దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ అన్నారు. అప్పన్న ఆలయ దర్శకర్తల మండలి సభ్యులు కోరాడ చంద్రమౌళితో కలిసి మంగళవారం సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు.


అనంతరం మాట్లాడుతూ ఇప్పటి వరకు తాను నటించిన మూడు సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు. తన తండ్రి దర్శకత్వంలో త్వరలో తెరకెక్కనున్న సినిమాలో నటిస్తున్నట్టు చెప్పారు. అదే విధంగా మరొక రెండు కథలను విని వాటికి సరే అన్నానని, వాటి వివరాలను త్వరలోనే అభిమానులతో పంచుకుంటానని తెలిపారు. దర్శనం అనంతరం తనతో సెల్ఫీలు తీసుకోవటానికి వచ్చిన అభిమానుల సెల్‌ఫోన్లతో తానే స్వయంగా సెల్పీలు తీసి వారిని ఆనందింపజేశారు.


Read more