-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » The problems of Asha workers must be solved-NGTS-AndhraPradesh
-
ఆశా వర్కర్‌ల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-02-23T05:56:25+05:30 IST
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్‌లు మంగళవారం జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి తరలివెళ్లేందుకు ప్రయత్నించగా న్యూపోర్టు పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

గాజువాక, ఫిబ్రవరి 22: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్‌లు మంగళవారం జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి తరలివెళ్లేందుకు ప్రయత్నించగా న్యూపోర్టు పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొంతమందిని అయితే ఇళ్ల వద్దే హౌస్ అరెస్ట్ చేశారు. న్యూపోర్టు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొవిరి అప్పలరాజు మాట్లాడుతూ 11వ పీఆర్‌సీ ప్రకారం ఆశా వర్కర్‌లకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రాకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.