ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరు మార్పు తగదు

ABN , First Publish Date - 2022-09-25T07:02:32+05:30 IST

హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించాన్న నిర్ణయం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభు త్వానికి తగదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ధూళి రంగనాయకులు, మం డల శాఖ అధ్యక్షుడు వి.దిన్‌బాబు అన్నారు. సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాడనర్సాపురంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన చేపట్టారు.

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరు మార్పు తగదు
ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న ధూళి రంగనాయకులు, దిన్‌బాబు తదితరులు

 సీఎం జగన్‌ నిర్ణయం ముమ్మాటికీ తప్పు

  వాడనర్సాపురంలో టీడీపీ శ్రేణులు ఆందోళన

రాంబిల్లి, సెప్టెంబరు 24 : హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించాన్న నిర్ణయం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభు త్వానికి తగదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ధూళి రంగనాయకులు, మం డల శాఖ అధ్యక్షుడు వి.దిన్‌బాబు అన్నారు. సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాడనర్సాపురంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన చేపట్టారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ స్థాపించిన హెల్త్‌ యూనివర్సీటీకి  ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును ఎలా పెడతారని ప్రశ్నించారు. జగన్‌ నిర్ణయం ముమ్మాటికీ తప్పని, అతని దిగజారుడు రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు అంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కశిరెడ్డి ప్రసాద్‌,  సీనియర్‌ నాయకులు, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కలిదిండి రఘురాజు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి లాలం తాతబాబు, ఉపాధ్యక్షుడు ఎస్‌.అప్పలరాజు, మండల తెలుగు మహిళా నాయకురాలు దల్లమ్మదేవి, మండల తెలుగు యువత అధ్యక్షుడు ఎరిపల్లి అజయ్‌, నాయకులు కర్రి సింహగిరి ప్రసాద్‌, చోడిపల్లి సత్యనారాయణ, సిహెచ్‌.దేముడు, వై.నారాయణరెడ్డి, చోడిపిల్లి మంగరాజు, జల్లి ఆదిరెడ్డి, ఎరిపల్లి చిట్టిబాబు, కోడ శ్రీను తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-25T07:02:32+05:30 IST