ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌కు అంబేడ్కర్‌ పేరు పెట్టాలి

ABN , First Publish Date - 2022-04-10T05:42:09+05:30 IST

ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌ బ్రిడ్జ్‌కు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలని, ఆయన విగ్రహాన్ని ఫ్లైఓవర్‌ మధ్యలో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎన్‌ఏడీ జోన్‌ ఎస్సీ,ఎస్టీ, దళిత సంఘాల అధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు.

ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌కు అంబేడ్కర్‌ పేరు పెట్టాలి
నినాదాలు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు

ఎన్‌ఏడీ జంక్షన్‌, ఏప్రిల్‌ 9: ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌ బ్రిడ్జ్‌కు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలని, ఆయన విగ్రహాన్ని ఫ్లైఓవర్‌ మధ్యలో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎన్‌ఏడీ జోన్‌ ఎస్సీ,ఎస్టీ, దళిత సంఘాల అధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు. ఎన్‌ఏడీ కొత్తరోడ్డు వద్దనున్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఈమేరకు నినాదాలు చేశారు. అక్కడ నుంచి ర్యాలీగా ఫ్లైఓవర్‌ బ్రిడ్జ్‌పైకి వెళ్లి తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా విచ్చేసిన డీహెచ్‌సీఎస్‌ రాష్ట్ర అధ్యక్షడు జే.వీ. ప్రభాకర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎత్తైన  అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఐదేళ్ల క్రితం రూ.26 లక్షలతో  ఎన్‌ఏడీ జంక్షన్‌లో ఏర్పాటు చేయడం జరిగిందని, ఫ్లైఓవర్‌ బ్రిడ్జ్‌ నిర్మాణంతో విగ్రహం ఎవరికీ కనిపించకుండా పోయిందన్నారు. రిపబ్లికన్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొడ్డు కల్యాణరావు, జీవీఎంసీ మాజీ కార్పొరేటర్‌ కొల్లాబత్తుల వెంగళరావు, ఎన్‌ఏడీ జోన్‌ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు జే.వీ.భాస్కరరావు, పి.వెంకటేశ్వరరావు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి గుడాల రాంబాబు, ఉపాధ్యక్షుడు మండే సత్యనారాయణ, అంబేడ్కర్‌ రాజకీయ చైతన్య వేదిక సభ్యులు సరస్వతి, భీంసేన సంక్షేమ సంఘం సభ్యులు తినాథ్‌, ముదపాక శ్రీనువాసరావు తదితరులు పాల్గొన్నారు.


Read more