వైసీపీ దుర్మార్గ పాలనకు మేధావులు చరమగీతం పాడాలి

ABN , First Publish Date - 2022-10-14T06:52:13+05:30 IST

వైసీపీ దుర్మార్గపు పాలనకు మేధావులు, విద్యావంతులు కలిసి చరమగీతం పాడాలని మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అన్నారు.

వైసీపీ దుర్మార్గ పాలనకు మేధావులు చరమగీతం పాడాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న గవిరెడ్డి రామానాయుడు


మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు

కె.కోటపాడు, అక్టోబరు 13: వైసీపీ దుర్మార్గపు పాలనకు మేధావులు, విద్యావంతులు కలిసి చరమగీతం పాడాలని మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అన్నారు. గురువారం మండలంలోని మర్రివలస, సూదివలస, పాతవలస, గొట్లాం, శృంగవరం గ్రామాల్లో ఆయన పర్యటించారు. పట్టభద్రుల ఓటర్లు నమోదుపై అవగాహన కల్పించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీని టీడీపీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మేధావులుదేనని అన్నారు. ఏపీ ఆర్థిక మాధ్యమంలోకి వెళ్లిపోయిందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబునాయుడు వల్లే సాధ్యం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సీమసురు రమణ, నారెం తాతబాబు, యాళ్ల నాయుడు, రుద్ర ఈశ్వరరావు, కంచిపాటి శ్రీను, కొట్యాడ అప్పారావు, జామి సిమ్మన్న, రెడ్డి సాధు, గొర్లె మహలక్ష్మి, మొల్లి గంగునాయుడు, గండేపల్లి నాగరాజు, డొక్కరి సిద్ధు పాల్గొన్నారు. 

Read more