బీసీ నాయకులపై ప్రభుత్వం వేధింపులు ఆపాలి

ABN , First Publish Date - 2022-06-08T05:22:54+05:30 IST

అధికార వైసీపీ ప్రభుత్వం సీఐడీ విభాగాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ బీసీ నాయకులపై వేధింపులకు పాల్పడడం తగదని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.

బీసీ నాయకులపై ప్రభుత్వం వేధింపులు ఆపాలి
సమావేశంలో మాట్లాడుతున్న పల్లా శ్రీనివాస్‌

టీడీపీ ‘విశాఖ’ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

విశాఖపట్నం, జూన్‌ 7: అధికార వైసీపీ ప్రభుత్వం సీఐడీ విభాగాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ బీసీ నాయకులపై వేధింపులకు పాల్పడడం తగదని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడు గౌతులచ్చన్న మనుమరాలు గౌతు శిరీషను ఇబ్బందులకు గురి చేయడం దారుణమన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లం ఘిస్తున్నారని విమర్శించారు. ఓ వైపు సామాజిక న్యాయభేరి పేరుతో బస్సు యాత్ర చేసి, మరోవైపు బలహీన వర్గాల వారిని తప్పుడు కేసులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.


శిరీషతోపాటు ఆదిరెడ్డి భవానీ, పంచుమర్తి అనురాధ, గ్రీష్మలపై అనుచిత పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేస్తే ఇదే ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదన్నారు. టీడీపీ నాయకులకు ఒక న్యాయం, వైసీపీ నాయకులకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్లే టెన్త్‌ ఫలితాలు ఇలా వచ్చాయని విమర్శించారు. పార్టీ నాయకులు ప్రసాద్‌, విజయ్‌కుమార్‌, పెంటిరాజు, రతన్‌కాంత్‌ పాల్గొన్నారు.  

Read more