ధరల పెంపుతో ప్రజలను దోచుకుంటున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-07-04T05:29:33+05:30 IST

నిత్యావసర ధరలు పెంచి ప్రజలను వైసీపీ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు.

ధరల పెంపుతో ప్రజలను దోచుకుంటున్న ప్రభుత్వం
సమావేశంలో మాట్లాడుతున్న పల్లా శ్రీనివాసరావు

టీడీపీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

గాజువాక, జూలై 3: నిత్యావసర ధరలు పెంచి ప్రజలను వైసీపీ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. గాజువాకలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిత్యావసర సరకులు, విద్యుత్‌, ఆర్టీసీ, తదితర ధరలను ఇష్టానుసారంగా పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. వైపీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బాదుడే బాదుడు అంటూ అన్ని ధరలను పెంచుతోందన్నారు. ఈ సమావేశంలో నాయకులు కళ్లేపల్లి అశోక్‌వర్మ, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్‌, బ్రహ్మనందం, రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.


Read more