బీచ్‌ రోడ్డులో ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్ర బృందం సందడి

ABN , First Publish Date - 2022-09-19T07:07:16+05:30 IST

శంకర్‌ప్రసాద్‌ మూల్పూరి సమర్పణలో అనీస్‌ ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌పై నాగశౌర్య, శిర్లేషెటియా హీరోహీరోయిన్లుగా ఉషా మూల్పూరి నిర్మించిన ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్ర బృందం ఆదివారం బీచ్‌ రోడ్డులో సందడి చేసింది.

బీచ్‌ రోడ్డులో ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్ర బృందం సందడి
కాలినడకన వెళ్తూ అభిమానులకు అభివాదం చేస్తున్న చిత్ర బృందం

విశాఖపట్నం, సెప్టెంబరు 18: శంకర్‌ప్రసాద్‌ మూల్పూరి సమర్పణలో అనీస్‌ ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌పై నాగశౌర్య, శిర్లేషెటియా హీరోహీరోయిన్లుగా ఉషా మూల్పూరి నిర్మించిన  ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్ర బృందం ఆదివారం బీచ్‌ రోడ్డులో సందడి చేసింది. ఈనెల 23న చిత్రం విడుదల నేపథ్యంలో ప్రమోషన్‌లో భాగంగా బృందం సభ్యులు కాళీమాత ఆలయం నుంచి వైఎంసీయే వరకు కాలినడకన వెళ్లి అభిమానులతో కలిసి సందడి చేశారు.


ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ విభిన్న కథాంశంతో రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌ట్రైన్‌మెంట్‌ చిత్రం అన్నారు. ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉందని, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని చెప్పారు. కాకినాడలో ప్రమోషన్‌ పూర్తిచేసుకుని విశాఖ వచ్చామని, బీచ్‌రోడ్డులో అభిమానుల సందడి ముచ్చట గొల్పిందన్నారు.

Read more