ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలు భేఖాతర్‌

ABN , First Publish Date - 2022-09-25T06:49:43+05:30 IST

ఓటరు జాబితాకు ఆధార్‌ అనుసంధానంలో వలంటీర్లు ప్రమేయం ఉండకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొత్తమల్లంపేటలో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది కలిసి శనివారం ఓటరు జాబితాకు ఆధార్‌ లింక్‌ కార్యక్రమం చేపట్టారు.

ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలు భేఖాతర్‌
కొత్తమల్లంపేటలో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఓటరు జాబితాకు ఆధార్‌ లింక్‌ చేస్తున్న దృశ్యంకొత్తమల్లంపేటలో వలంటీర్లతో కలిసి సచివాలయ సిబ్బంది ఓటర్‌ కార్డుకు ఆధార్‌ అనుసంధానం

జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తా

టీడీపీ గ్రామ అధ్యక్షుడు లోవరాజు


గొలుగొండ, సెప్టెంబరు 24: ఓటరు జాబితాకు ఆధార్‌ అనుసంధానంలో వలంటీర్లు ప్రమేయం ఉండకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొత్తమల్లంపేటలో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది కలిసి శనివారం ఓటరు జాబితాకు ఆధార్‌ లింక్‌ కార్యక్రమం చేపట్టారు. దీనిపై టీడీపీ గ్రామ అధ్యక్షుడు పైల లోవరాజు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కొత్తమల్లంపేట సచివాలయంలో ఎన్నికల సంఘం ఆదేశాలు అమలు కావడం లేదని లోవరాజు ఆరోపించారు. వారం రోజులుగా ఇదే ప్రక్రియ కొనసాగుతుందని, ఇప్పటివరకు 400 మంది ఓటర్లకు ఆధార్‌ అనుసంధానం చేశారన్నారు. వలంటీర్లతో కలిసి ఓటర్లకు ఆధార్‌ అనుసంధానం చేయకూడదు కదా అని సచివాలయ సిబ్బందిని అడిగితే.. మీకు నచ్చివారికి ఫిర్యాదు చేసుకోమని అన్నారని చెప్పారు. అందువల్ల సోమవారం స్పందనలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్టు లోవరాజు తెలిపారు. 


Read more