వైసీపీకి పాపం పండే రోజులు దగ్గరలోనే..

ABN , First Publish Date - 2022-10-01T07:00:49+05:30 IST

వైసీపీకి పాపం పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ అన్నారు.

వైసీపీకి పాపం పండే రోజులు దగ్గరలోనే..
రిలే నిరాహార దీక్షలో మాట్లాడుతున్న పీవీజీ కుమార్‌


ఎన్టీఆర్‌ పేరు తొలగించడం దుర్మార్గపు చర్య

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ 

మాడుగుల, సెప్టెంబరు 30: వైసీపీకి  పాపం పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ అన్నారు. ఎన్టీఆర్‌ వైద్య విశ్వ విద్యాలయం పేరు మార్పు వెనుక కుట్ర ఉందన్నారు. శుక్రవారం స్థానిక బస్టాండ్‌ ఆవరణంలో ఏర్పాటుచేసిన రిలే నిరాహార దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అన్ని విషయాల్లో కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందన్నారు. కనీసం రోడ్లు కూడా బాగు చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. లేని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, అభివృద్ధిలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయామన్నారు. నియోజకవర్గంలోని రోడ్లపై ప్రయాణం చేస్తూ ప్రజలు నరకయాతన పడుతున్నా ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుకు కనిపించలేదని ధ్వజమెత్తారు. ప్రజలకు లేనిపోని పథకాలు పెట్టి పది రూపాయాలిచ్చి వంద రూపాయలు దోచుకొంటుందన్నారు. సొంత చెల్లి కూడా జగన్‌ని తప్పుపట్టినా సిగ్గు లేకుండా వెకిలినవ్వులు నవ్వుతున్నాడని అన్నారు.  ఎన్టీఆర్‌ యూనివర్సీటికి రాజశేఖరరెడ్డి పేరు పెట్టడం సమంజసం కాదని, వెంటనే ఎన్టీఆర్‌ పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు. అంతకుముందు మాజీ ఎంపీపీ పుప్పాల అలప్పలరాజు, ఉండూరు దేముడు, శ్రీరామ్మూర్తి తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఓండ్రు కృష్ణ, పుప్పాల రమేష్‌, అప్పాన భాస్కరరావు, రాజు తదితరులు పాల్గొన్నారు. 

Read more