-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » That will be our referendum in the next election Minister Amar Nath mvs-MRGS-AndhraPradesh
-
AP News: వచ్చే ఎన్నికల్లో అదే మా రెఫరెండం: మంత్రి అమర్‌నాథ్
ABN , First Publish Date - 2022-09-14T00:58:11+05:30 IST
Vishakapatnam: మూడు రాజధానులు.. వైసీపీ ఐదేళ్ల పాలన.. రెఫరెండంగా 2024 ఎన్నికలకు వెళ్తామని మంత్రి గుడివాడ అమర్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధానిపై చాలా ఏళ్లుగా స్పష్టత లేదు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని టీడీపీ పట్టుబడుతుంటే.. వైసీపీ మాత్రం అందుకు

Vishakapatnam: మూడు రాజధానులు.. వైసీపీ (YCP) ఐదేళ్ల పాలన.. రెఫరెండంగా 2024 ఎన్నికలకు వెళ్తామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (Gudivaada Amarnath) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధానిపై చాలా ఏళ్లుగా స్పష్టత లేదు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని టీడీపీ పట్టుబడుతుంటే.. వైసీపీ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. రాజధాని అంశానికి 2024 ఎన్నికల్లో ఫుల్ స్టాప్ పడుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను గద్దె దించాలన్నదే అమరావతి రైతుల పాదయాత్ర లక్ష్యమని ఆరోపించారు. పాదయాత్రను లిప్స్టిక్ రాసుకున్న వ్యాపారులకు..అభివృద్ధి చెందని ఉత్తరాంధ్రవాసులకు మధ్య జరుగుతున్నయాత్రగా అమర్‌నాథ్ అభివర్ణించారు. ఎంపీ రఘురామరాజు (MP Raghurama raju) లాంటి జోకర్ గురించి మాట్లాడడం సమయం వృథా అని పేర్కొన్నాడు.