టెన్త్‌ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం

ABN , First Publish Date - 2022-04-24T06:22:56+05:30 IST

అనకాపల్లి జిల్లా 24 మండలాల పరిధిలో ఉన్న పదో తరగతి విద్యార్థులు తమ హాల్‌ టికెట్‌ చూపించి పరీక్షలకు హాజరయ్యేందుకు పల్లె వెలుగు, సిటీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రజా రవాణా శాఖ(పీటీడీ) జిల్లా అధికారి కె.పద్మావతి తెలిపారు.

టెన్త్‌ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం
ప్రజా రవాణా సంస్థ జిల్లా అధికారి కె పద్మావతికి స్వాగతం పలుగుతున్న ఉద్యోగులు

పరీక్షల సమయంలో హాల్‌ టికెట్‌ చూపించి ప్రయాణించవచ్చు

పీటీడీ జిల్లా అధికారి పద్మావతి

నర్సీపట్నం, ఏప్రిల్‌ 23 : అనకాపల్లి జిల్లా 24 మండలాల పరిధిలో ఉన్న పదో తరగతి విద్యార్థులు తమ హాల్‌ టికెట్‌ చూపించి పరీక్షలకు హాజరయ్యేందుకు పల్లె వెలుగు, సిటీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రజా రవాణా శాఖ(పీటీడీ) జిల్లా అధికారి కె.పద్మావతి తెలిపారు. శనివారం ఆమె నర్సీపట్నం డిపోను సందర్శించారు. డిపో మేనేజర్‌ సూర్యపవన్‌ కుమార్‌, ఉద్యోగులు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షల సమయాలకు అనుగుణంగా, రద్దీని బట్టి బస్సులు నడుపుతామన్నారు. ప్రత్యేకంగా బస్సు కావాలంటే ప్రధానోపాధ్యాయులు ముందుగా తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఎస్‌ఎస్‌ నాయుడు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-24T06:22:56+05:30 IST