Palla srinivasrao: విశాఖని గుల్ల చేసి... పరిపాలన రాజధాని చేస్తారా?

ABN , First Publish Date - 2022-09-26T17:26:59+05:30 IST

విశాఖని గుల్ల చేసి...పరిపాలన రాజధాని చేస్తారా? అని విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Palla srinivasrao: విశాఖని గుల్ల చేసి... పరిపాలన రాజధాని చేస్తారా?

విశాఖపట్నం: విశాఖని గుల్ల చేసి...పరిపాలన రాజధాని చేస్తారా? అని విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla srinivasa rao)ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.... ప్రజలను తప్పుతోవ పట్టించడానికే వైసీపీ (YCP)రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారని అన్నారు. ఎగ్జిక్యూటివ్ కాపిటల్ పేరుతో.. విశాఖను విధ్వంసం చేశారని మండిపడ్డారు. రాజధానిని నిర్ణయించే హక్కు ఇవ్వాలని విజయ సాయి రెడ్డి (Vijayasaireddy) ఎందుకు ప్రైవేట్ బిల్లు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల బిల్లు రద్దు చేసి గజిట్ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. 3 రాజధానులను ఏర్పాటు చేసే హక్కే లేదని... మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని వైసీపీ మళ్లీ ప్రజలను మోసం చేయాలను అనుకుంటోందని విమర్శించారు. విశాఖను గంజాయికి రాజధానిగా చేసిన ఘనత వైసీపీదే అని పల్లా శ్రీనివాసరావు (TDP Leader) వ్యాఖ్యలు చేశారు. 

Read more