AP News.. కొత్త మంత్రులు పిట్టల దొరల్లా మాట్లాడుతున్నారు: టీడీపీ నేత బండారు

ABN , First Publish Date - 2022-09-26T20:58:00+05:30 IST

కొత్త మంత్రులు పిట్టల దొరల్లా మాట్లాడుతున్నారని టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి ఎద్దేవా చేశారు.

AP News.. కొత్త మంత్రులు పిట్టల దొరల్లా మాట్లాడుతున్నారు: టీడీపీ నేత బండారు

విశాఖ (Visakha): కొత్త మంత్రులు (New Ministers) పిట్టల దొరల్లా మాట్లాడుతున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి (Bandaru Satyanarayana Murthy) ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి అభివృద్ధి చేసారో చెప్పాలన్నారు. చంద్రబాబు (Chandrababu) హయాంలో ఏం చేశామో, ఏమేమి వచ్చాయో చెప్పామని.. అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం మూడున్నారెళ్లుగా ఏమి చేశారో, ఏం తెచ్చారో వైసీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.


విశాఖలో అధికారులతో సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఇంతవరకు సమావేశం పెట్టలేదని బండారు సత్యనారాయణ మూర్తి విమర్శించారు. అమరావతి రైతులను అపహాస్యం చేయొద్దన్నారు. విశాఖకు ఎంత ఇచ్చారో.. పులివెందులకు ఎంత ఇచ్చారో చెప్పాలన్నారు. ఆనాడు తాము తలుచుకుంటే జగన్ బయటకు వచ్చేవారా? పాదయాత్ర చేసేవారా? అని ప్రశ్నించారు. బహుశా అప్పుడు బొత్స సత్యనారాయణ వైసీపీలో లేరని అనుకుంటా? అన్నారు. వోక్స్ వాగన్  పూణేకు ఎందుకు పోయిందో మంత్రి బొత్స చెప్పాలని బండారు సత్యనారాయణ మూర్తి  డిమాండ్ చేశారు.

Read more