గిరిజన గ్రామాల్లో కానరాని అభివృద్ధి

ABN , First Publish Date - 2022-12-30T00:30:21+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం గిరి గ్రామాల అభివృద్ధిపై కనీస దృష్టి సారించడం లేదని, ఏ గ్రామాన్ని సందర్శించినా సమస్యలు దర్శనమిస్తున్నాయని మాజీ మంత్రి, టీడీపీ అరకు నియోజకవర్గం ఇన్‌చార్జి కిడారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు.

గిరిజన గ్రామాల్లో కానరాని అభివృద్ధి
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌

ముంచంగిపుట్టు, డిసెంబరు 29: రాష్ట్ర ప్రభుత్వం గిరి గ్రామాల అభివృద్ధిపై కనీస దృష్టి సారించడం లేదని, ఏ గ్రామాన్ని సందర్శించినా సమస్యలు దర్శనమిస్తున్నాయని మాజీ మంత్రి, టీడీపీ అరకు నియోజకవర్గం ఇన్‌చార్జి కిడారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. మండలంలో దోడిపుట్టు పంచాయతీ చిన్నసిందిపుట్టు గ్రామంలో గురువారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా నేటికీ గిరి గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పించలేకపోవడం విచారకరమన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే గిరి గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, రహదారులు, తదితర అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టడంలేదని ఆయన ధ్వజమెత్తారు. అలాగే బోయవాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చరాదని, ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకుంటే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ,ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యులు సివేరి అబ్రహం, అరకు అసెంబ్లీ మహిళా ఉపాఽధ్యక్షురాలు కిల్లో సన్యాసమ్మ, సర్పంచులు పి.పాండురంగ స్వామి, వి.లక్ష్మణ్‌, కె.శివశంకర్‌, వి.దనియ, టీడీపీ మండల అధ్యక్షుడు కిల్లో బలరాం, టీడీపీ నాయకులు బాబూజీ, రఘురాం, ములియ, అయితన్న, కామేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:30:21+05:30 IST

Read more