-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Talent is the touchstone for the elevation of judges-MRGS-AndhraPradesh
-
న్యాయమూర్తుల ఉన్నతికి ప్రతిభే గీటురాయి
ABN , First Publish Date - 2022-04-25T05:12:10+05:30 IST
న్యాయమూర్తుల ఉన్నతికి వారి ప్రతిభే గీటురాయి అని, అది మాటల్లో కాకుండా వారి తీర్పుల్లో కనిపిస్తుందని రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ అన్నారు.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్
విశాఖపట్నం, ఏప్రిల్ 24: న్యాయమూర్తుల ఉన్నతికి వారి ప్రతిభే గీటురాయి అని, అది మాటల్లో కాకుండా వారి తీర్పుల్లో కనిపిస్తుందని రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ అన్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా ఇటీవల నియమితులైన చీమలపాటి రవి సన్మాన కార్యక్రమం జిల్లా కోర్టు ఆవరణలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వృత్తిపరంగా ఎదగాలంటే నిరంతరం శ్రమ, పట్టుదల ఉండాలని, వేరే మార్గాలు లేవన్నారు.
పదవులు బాధ్యతను పెంచుతాయన్నారు. జస్టిస్ రవి న్యాయవాదిగా కోర్టులో వ్యవహరించిన తీరు యువ న్యాయవాదులకు మార్గదర్శకం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ డి.వి.వి.ఎస్.సోమ యాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రరాయ్, జస్టిస్ బట్టు దేవానంద్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అవధానం హరనాథశర్మ, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.