-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Swayambhu Vighneswara Temple Chaviti festival-NGTS-AndhraPradesh
-
స్వయంభూ విఘ్నేశ్వరాలయంలో చవితి ఉత్సవ రాట
ABN , First Publish Date - 2022-08-15T06:12:56+05:30 IST
స్థానిక స్వయంభూ విఘ్నేశ్వరాలయంలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఆదివారం ఉత్సవ రాట వేశారు.

చోడవరం, ఆగస్టు 14: స్థానిక స్వయంభూ విఘ్నేశ్వరాలయంలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఆదివారం ఉత్సవ రాట వేశారు. ఈనెల 31 నుంచి చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సత్యనారాయణ, ఉత్సవ ప్రోత్సాహకులు పి. జయదేవ్, ఆలయ కమిటీ చైర్మన్ నున్న నాగేశ్వరరావు, అర్చకులు కొడమంచిలి చలపతి, ఆలయ కమిటీ సభ్యులు జ్యోతుల శ్రీను, మెడికల్ మూర్తి, పూసర్ల రవీంద్ర, స్థానిక పెద్దలు ధర్మతేజరెడ్డి, గనిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.