సింహాచలేశునికి స్వర్ణ సంపెంగల పూజ

ABN , First Publish Date - 2022-01-28T06:02:58+05:30 IST

సింహాచలేశునికి స్వర్ణ సంపెంగల పూజను వైభవంగా చేశారు.

సింహాచలేశునికి స్వర్ణ సంపెంగల పూజ
స్వర్ణ సంపెంగలతో పూజలందుకున్న ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి

సింహాచలం, జనవరి 27: సింహాచలేశునికి స్వర్ణ సంపెంగల పూజను వైభవంగా చేశారు. ఆర్జిత సేవల్లో భాగంగా గురువారం ఉదయం సుప్రభాత సేవలు తర్వాత ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో కల్యాణ మండపంలో ప్రత్యేక ముత్యాల వేదికపై ఉంచారు. ఆలయ ఉపప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో భక్తుల గోత్రనామాలతో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో షోడశోపచరాల పూజలు జరిపి నృసింహ అష్టోత్తర శతనామావళి పఠిస్తూ పసిడి సంపెంగలతో అర్చన చేశారు. మంత్రపుష్పం, మంగళనీరాజనాలు సమర్పించాక పూజల్లో పాల్గొన్న జంటలకు శేషవస్త్రాలు, వేదాశీర్వచనాలు, ప్రసాదాలను అందజేశారు. 

Read more