సూపర్‌స్టార్‌ కృష్ణ విగ్రహం రెడీ!

ABN , First Publish Date - 2022-11-25T03:23:03+05:30 IST

సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ విగ్రహం ప్రముఖ శిల్పి రాజ్‌కుమార్‌ వడయార్‌ చేతిలో రూపుదిద్దుకుంటోంది.

సూపర్‌స్టార్‌ కృష్ణ విగ్రహం రెడీ!

కొత్తపేట, నవంబరు 24: సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ విగ్రహం ప్రముఖ శిల్పి రాజ్‌కుమార్‌ వడయార్‌ చేతిలో రూపుదిద్దుకుంటోంది. కృష్ణ కుటుంబ సభ్యుల కోరిక మేరకు 27 సంవత్సరాల వయసులో ఉన్న కృష్ణ రూపాన్ని విగ్రహంగా రూపొందించినట్టు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఉంటున్న వడయార్‌ చెప్పారు. ఈ నెల 27న హైదరాబాద్‌లో జరిగే కృష్ణ దశదిన కర్మ జరిగే హాలులో ఈ విగ్రహాన్ని పెడతారన్నారు. నివాళులర్పించిన అనంతరం దానిని కృష్ణ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేస్తారని తెలిపారు.

Updated Date - 2022-11-25T03:23:03+05:30 IST

Read more