AP News.. అమలాపురం: వైసీపీ నేత ఆత్మహత్యా యత్నం

ABN , First Publish Date - 2022-10-11T14:34:58+05:30 IST

అమలాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ తిక్కిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

AP News.. అమలాపురం: వైసీపీ నేత ఆత్మహత్యా యత్నం

కోనసీమ జిల్లా: అమలాపురం వైసీపీ నేత, మున్సిపల్ వైస్ ఛైర్మన్ తిక్కిరెడ్డి వెంకటేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో కుటుంబసభ్యులు అతనిని చికిత్స కోసం అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా గతంలో తన ఇల్లు కబ్జాకు ప్రయత్నించారని  ఓ మహిళ తిక్కిరెడ్డి వెంకటేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.


Read more