యాప్‌లో విద్యార్థుల హాజరు నమోదు తప్పనిసరి

ABN , First Publish Date - 2022-02-23T05:53:31+05:30 IST

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదవుతున్న విద్యార్థుల హాజరును ప్రతీరోజూ తప్పనిసరిగా యాప్‌లో నమోదు చేయాలని విద్యాశాఖ కమిషనర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

యాప్‌లో విద్యార్థుల హాజరు  నమోదు తప్పనిసరి

ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ కమిషనర్‌

భీమునిపట్నం (రూరల్‌), ఫిబ్రవరి 22: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదవుతున్న విద్యార్థుల హాజరును ప్రతీరోజూ తప్పనిసరిగా యాప్‌లో నమోదు చేయాలని విద్యాశాఖ కమిషనర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన స్టూడెంట్‌ అటెండన్స్‌ యాప్‌లో విద్యార్థుల హాజరును నమోదు చేయాలని, అలా చేయని పాఠశాలల వివరాలు తమకు వెంటనే తెలిసిపోతాయన్నారు. యాప్‌లో హాజరు నమోదు చేయని పాఠశాలల ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాన్ని డీఈవోలు, జాయింట్‌ కలెక్టర్లు, ఆర్జేడీలకు తెలియజేశామని పేర్కొన్నారు. 


Updated Date - 2022-02-23T05:53:31+05:30 IST