11న వైద్య ఉద్యోగుల రాష్ట్ర మహాసభ

ABN , First Publish Date - 2022-11-25T03:42:33+05:30 IST

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వచ్చే నెల 11న వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నట్లు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.ఆస్కార్‌రావు ప్రకటించారు.

11న వైద్య ఉద్యోగుల రాష్ట్ర మహాసభ

అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వచ్చే నెల 11న వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నట్లు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.ఆస్కార్‌రావు ప్రకటించారు. గురువారం విజయవాడలో జరిగిన ఉద్యోగుల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖలో ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మహాసభ నిర్వహిస్తున్నామన్నారు. దీనికి ఆల్‌ ఇండియా నేషనల్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు, మాజీ ఎంపీ గొంగళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారన్నారు. 13 జిల్లాల నుంచి ఉద్యోగులు తరలిరావాలని కోరారు.

Updated Date - 2022-11-25T03:42:48+05:30 IST

Read more