నేడు యంత్ర సేవా పథకం ప్రారంభం

ABN , First Publish Date - 2022-06-07T06:54:05+05:30 IST

పట్టణంలో యంత్ర సేవా పథకం ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. అనకాపల్లి జిల్లాకు సంబంధించి 154 ట్రాక్టర్లను డిప్యూటీ సీఎం, పంచాయతీ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మంగళవారం పంపిణీ చేయనున్నారు.

నేడు యంత్ర సేవా పథకం ప్రారంభం
ట్రాక్టర్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌, వ్యవసాయాధికారులు

పంపిణీకి సిద్ధమైన ట్రాక్టర్లు.. పరిశీలించిన కలెక్టర్‌


అనకాపల్లి అర్బన్‌, జూన్‌ 6: పట్టణంలో యంత్ర సేవా పథకం ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. అనకాపల్లి జిల్లాకు సంబంధించి 154 ట్రాక్టర్లను డిప్యూటీ సీఎం, పంచాయతీ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మంగళవారం పంపిణీ చేయనున్నారు. అనకాపల్లి మున్సిపల్‌ గ్రౌండ్‌లో పంపిణీకి సిద్ధం చేసిన ఈ ట్రాక్టర్లను జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి సోమవారం పరిశీలించారు. యంత్ర సేవ మేళాలో భాగంగా 188 ఆర్‌బీకే సీహెచ్‌సీ గ్రూపులకు 150 ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్ర పరికరాలు అందించనున్నట్టు జిల్లా వ్యవసాయాధికారి లీలావతి తెలిపారు. కాగా, క్రీడలకు ఎంతో అనుకూలంగా లక్షలాది రూపాయల ఖర్చుతో తయారు చేసిన క్రీడా మైదానంలోకి ట్రాక్టర్లు రావడంతో పూర్తిగా ధ్వంసమైంది. అలాగే గ్రౌండ్‌లో జిమ్‌కు తాళాలు వేయడంతో యువకులు నిరాశ వ్యక్తం చేశారు. 


Read more