విద్యుత్‌ బిల్లులకు ఆధార్‌ అప్‌డేట్‌ వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2022-09-08T06:27:35+05:30 IST

గిరిజన వినియోగదారులకు విద్యుత్‌ బిల్లులకు ఆధార్‌ అప్‌డేట్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ ఎల్‌.మహేంద్రనాథ్‌ సూచించారు.

విద్యుత్‌ బిల్లులకు ఆధార్‌ అప్‌డేట్‌ వేగవంతం చేయండి
అధికారులు, సిబ్బందితో మాట్లాతన్న ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ

ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ మహేంద్రనాథ్‌

పాడేరు, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): గిరిజన వినియోగదారులకు విద్యుత్‌ బిల్లులకు ఆధార్‌ అప్‌డేట్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ ఎల్‌.మహేంద్రనాథ్‌ సూచించారు. స్థానిక విద్యుత్‌ ఈఈ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో బుధ వారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన వినియోగదారులకు 200 యూనిట్ల వరకు రాయితీ ఉన్నందున ప్రతీ బిల్లుకు ఆధార్‌ అప్‌డేట్‌ చేయాలన్నారు. అలాగే విద్యుత్‌ బిల్లులు బకాయిలు లేకుండా వసూలు చేయాలని, సమస్యలు తలెత్తితే తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. విధులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రమాదాలకు గురికాకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈపీడీసీఎల్‌ విశాఖ జోన్‌-1 ఈఈ కె.సత్యనారాయణ, డిప్యూటీ ఈఈ వి.మహేశ్వరెడ్డి, ఈఈ మల్లికార్జునరావు, డిప్యూటీ ఈఈ డి.భాస్కంరావు, ఏఈఈ భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు. 

Read more