జేఈఈ, నీట్‌లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

ABN , First Publish Date - 2022-05-24T06:16:49+05:30 IST

గురుకుల విద్యాలయాల్లో చదివే విద్యార్థులు జేఈఈ, నీట్‌లో మెరుగైన ఫలితాలు సాదించడానికి గురుకుల విద్యాలయా సంస్థ స్వల్పకాలిక శిక్షణా కేంద్రాలను సోమవారం ప్రారంభించినట్టు విశాఖ జిల్లా గురుకులాల కో-ఆర్డినేటర్‌ ఎస్‌.రూపవతి తెలిపారు.

జేఈఈ, నీట్‌లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
శిక్షణా తరగతులు ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా గురుకులాల కో-ఆర్డినేటర్‌ రూపవతి, తదితరులు

కొమ్మాది, మే 23: గురుకుల విద్యాలయాల్లో చదివే విద్యార్థులు జేఈఈ, నీట్‌లో మెరుగైన ఫలితాలు సాదించడానికి గురుకుల విద్యాలయా సంస్థ స్వల్పకాలిక శిక్షణా కేంద్రాలను సోమవారం ప్రారంభించినట్టు విశాఖ జిల్లా గురుకులాల కో-ఆర్డినేటర్‌ ఎస్‌.రూపవతి తెలిపారు. సోమవారం మధురవాడ రిక్షాకాలనీలోని గురుకుల సాంఘిక సంక్షేమ ప్రతిభా బాలికల  కళాశాలలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థులలో 87 మంది జీఈఈకి, 204 మంది నీట్‌ శిక్షణకు ఎంపికయ్యారన్నారు. వీరందరికీ మధురవాడ గురుకుల కళాశాలలో శిక్షణను అందించటానికి అనుభవజ్ఞులైన అధ్యాపకులను నియమించామన్నారు. సోమవారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ఎనిమిది శిక్షణా కేంద్రాలను సాంఘిక సంక్షేమకశాక మంత్రి మేరుగ నాగార్జున వర్చువల్‌ విధానంలో శిక్షణను ప్రారంభించారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జి నాగమణి, శిక్షణా కేంద్రం కో-ఆర్డినేటర్‌ రేగ రాంప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.


Read more