లక్ష్మీనారాయణలకు విశేష పూజలు

ABN , First Publish Date - 2022-11-21T00:56:50+05:30 IST

గవరపాలెం గౌరీ పంచాయతన ఆల యంలో లక్ష్మీనారాయణలకు కోటి తులసిపత్రి, కోటి కుంకుమార్చనలు వైభవోపేతంగా జరుగుతున్నాయి

లక్ష్మీనారాయణలకు విశేష పూజలు
స్వామి పూజలకు హాజరైన భక్తులు

అనకాపల్లి టౌన్‌, నవంబరు 20 : గవరపాలెం గౌరీ పంచాయతన ఆల యంలో లక్ష్మీనారాయణలకు కోటి తులసిపత్రి, కోటి కుంకుమార్చనలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం యాగశాలలో 108 మంది దంపతులతో అర్చకులు పూజలు నిర్వహించారు. జీవీఎంసీ అనకాపల్లి జోనల్‌ కమిషనర్‌ కనకమహాలక్ష్మి సహా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అనంతరం గోశాల చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బొడ్డేడ సన్యాసినాయుడు, బుద్ద రమణాజీ మాట్లాడుతూ సోమవారం పూర్ణాహుతి, శాంతి కల్యాణం, అన్న సమారాధన, భారీ ఎత్తున ఊరేగింపు వంటివి ఉంటాయన్నారు. కమిటీ ప్రతినిధులు, మహిళా మండళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-21T00:56:50+05:30 IST

Read more