విశాఖ మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలు

ABN , First Publish Date - 2022-10-08T06:40:48+05:30 IST

ప్రయాణికుల డిమాండ్‌ మేరకు వయా విశాఖ మీదుగా శ్రీకాకుళం-తిరుపతి మధ్య రానుపోను ఒక ట్రిప్పు ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు సీనియర్‌ డీసీఎం త్రిపాఠి తెలిపారు.

విశాఖ మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలు

విశాఖపట్నం, అక్టోబరు 7:


ప్రయాణికుల డిమాండ్‌ మేరకు వయా విశాఖ మీదుగా శ్రీకాకుళం-తిరుపతి మధ్య రానుపోను ఒక ట్రిప్పు ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు సీనియర్‌ డీసీఎం త్రిపాఠి తెలిపారు. 07451 నంబరు గల రైలు ఈనెల తొమ్మిదో తేదీ (ఆదివారం) రాత్రి 8.10 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.50 గంటలకు విశాఖ చేరి, తిరిగి ఇక్కడ నుంచి 10.10 గంటలకు బయలుదేరి 12.30 గంటలకు శ్రీకాకుళం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 07452 నంబరు గల రైలు ఈనెల 10న (సోమవారం) మధ్యాహ్నం 3.00 గంటలకు శ్రీకాకుళంలో బయలుదేరి సాయంత్రం 5.15 గంటలకు విశాఖ చేరి తిరిగి ఇక్కడ నుంచి 5.35 గంటలకు బయలుదేరి మర్నాడు ఉదయం 8.00 గంటలకు తిరుపతి చేరుతుంది. 

Read more