పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

ABN , First Publish Date - 2022-11-21T00:50:01+05:30 IST

పోరాటాలతోనే విద్యారంగంలోని సమస్యలు పరిష్కారమ వుతాయని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ తెలిపారు. స్థానిక కాఫీహౌస్‌లో యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన విద్యా సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు.

పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
మాట్లాడుతున్న పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ

- యూటీఎఫ్‌ విద్యా సదస్సులో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ

- 12న ఐటీడీఏలు, వచ్చే నెల 22న విజయవాడలో టీడబ్ల్యూ కార్యాలయం ముట్టడికి పిలుపు

పాడేరు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): పోరాటాలతోనే విద్యారంగంలోని సమస్యలు పరిష్కారమ వుతాయని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ తెలిపారు. స్థానిక కాఫీహౌస్‌లో యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన విద్యా సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. గిరిజన ప్రాంతంలో విద్యారంగం ఎంతో వెనుకబాటుకు గురైందని, మరింత అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే యూటీఎఫ్‌ జీపు జాత పేరిట 50కి పైబడి ఆశ్రమ పాఠశాలలను సందర్శించి, అక్కడున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. గిరిజన ప్రాంతంలో మరిన్ని ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అమ్మఒడి అమలు పేరిట విద్యార్థులకు ఇవ్వాల్సిన పాకెట్‌మనీ, కాస్మోటిక్‌ను పంపిణీ చేయకపోవడం దారుణమన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ డిసెంబరు 12న ఐటీడీఏలు, 22న విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం ముట్టడికి ఆయన పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులంతా ఐక్యంగా ఈ ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారానికి టీచర్లు మరింత తెగువగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల సానుకూలంగా లేదన్నారు. అలాగే ఉపాధ్యాయులకు సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. అలాగే జీవో:3ను పునరుద్ధించాలని, సీఆర్‌టీలను రెగ్యులర్‌ చేయాలని, ఆదివాసీ భాషా వలంటీర్లను రెన్యువల్‌ వేయాలని, గిరిజన సంక్షేమ శాఖ ఉపాఽధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని, ఉపాధ్యాయుల రాత్రి బస రద్దు చేయాలని, గిరిజన ప్రాంత విద్యాలయాల్లోని సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతకు ముందు యూటీఎఫ్‌ నేతలు ఐటీడీఏ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరావు, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్స, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు విల్సన్‌, ఉమామహేశ్వరరావు, నేతలు చీకటి నాగేశ్వరరావు, చిట్టిబాబు, కొండబాబు, కర్రిబాబు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన యూటీఎఫ్‌ నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-21T00:50:01+05:30 IST

Read more