కొత్తమల్లవరంలో విషాద ఛాయలు

ABN , First Publish Date - 2022-08-31T06:34:33+05:30 IST

మండలంలోని కొత్తమల్లవరం గ్రామంలో ఒకే కుటుంబంలో మూడురోజుల్లో ముగ్గురు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కొత్తమల్లవరంలో విషాద ఛాయలు


మూడు రోజుల్లో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు దుర్మరణం

ఆ విషయం తెలిసి అమ్మమ్మ గుండెపోటుతో హఠాన్మరణం 

గొలుగొండ, ఆగస్ట్టు 30: మండలంలోని కొత్తమల్లవరం గ్రామంలో ఒకే కుటుంబంలో మూడురోజుల్లో ముగ్గురు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొత్తమల్లవరం గ్రామానికి చెందిన అన్నదమ్ములు కోసూరి రాజకుమార్‌,శివకుమార్‌లు మేనమామ కుమారుడు వరద రాజస్వామి ఆదివారం ఒకే బైక్‌పై తలుపులమ్మ దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా డి. పోలవరం సమీపంలో కారు ఢీకొట్టింది. బైక్‌పై వస్తున్న ఇద్దరు అన్నదమ్ముల్లో కోసూరి రాజకుమార్‌(30) అక్కడికక్కడే మృతి చెందగా.. శివకుమార్‌(26) తీవ్రగాయాలతో విశాఖ కేజీహెచ్‌కు చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గ మధ్యలో అదేరోజు రాత్రి మృతి చెందాడు. ఇద్దరు అన్నదమ్ముల మరణవార్త తెలిసిన అమ్మమ్మ వరద చింతల్లి (65) గుండెపోటుతో సోమవారం మృతిచెందింది. ఇదే ప్రమాదంలో తీవ్రగాయాలైన వరద రాజస్వామి విశాఖ ప్రైవేటు హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆ కుటుంబ సభ్యులను సర్పంచ్‌ కొల్లు రాంబాబు, పరిసర గ్రామస్థులు పరామర్శించారు. ఆ కుటుంబానికి ఎంత కష్టం వచ్చిందని అంటూ పలువురు రోదించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Read more