-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Selfconfidence is a weapon for women-NGTS-AndhraPradesh
-
మహిళలకు ఆత్మస్థైర్యమే ఆయుధం
ABN , First Publish Date - 2022-09-11T05:57:20+05:30 IST
మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడరాదని దిశ పోలీస్‌స్టేషన్ సీఐ టి.లక్ష్మి పేర్కొన్నారు.

ఓటమి పలు అంశాల్లో గుణపాఠం
దిశ పోలీస్ స్టేషన్ సీఐ లక్ష్మి
తుమ్మపాల, సెప్టెంబరు 10 : మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడరాదని దిశ పోలీస్‌స్టేషన్ సీఐ టి.లక్ష్మి పేర్కొన్నారు. స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంయుక్త కళాశాలలో శనివారం ‘ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ ఓటమి పలు అంశాల్లో గుణపాఠాన్ని నేర్పిస్తుందన్నారు. చేసిన తప్పిదాలను సరిచేసుకుంటూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తమ సెల్‌ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ఎస్‌ఐ పి.రాములమ్మ, ఫౌండేషన్ జిల్లా కార్యదర్శి జీఎల్‌ఎన్ శాస్త్రి, కోరాడ అప్పలరాజు, సంయుక్త కళాశాల సిబ్బంది గోవిందరావు, దాడి రవి, సోమేశ్వరిదేవి, జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.